పుట్టపర్తి: పోలీసులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, తెదేపా నాయకురాలు పర్వీన్‌బాను ఆరోపించారు. సోమవారం కదిరి డీఎస్పీ, సీఐ, మరికొంత మంది కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ కోరారు. ఈ మేరకు వారిపై ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 7న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి మున్సిపాలిటీ 3వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంలో సమస్యల పరిష్కార విషయమై కాలనీకి చెందిన ఉమాదేవి, శంకరమ్మ, గంగయ్య తదితరులు ఎమ్మెల్యేని ప్రశ్నించారు.
అక్కడే ఉన్న సీఐ మధు, సిబ్బంది మహిళలను అసభ్య పదజాలంతో దుర్భాషాలాడటమేకాక వారిని తోస్తూ. భౌతికంగా తాకారన్నారు. దీనిపై తాను ఈ నెల 8న ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే. 'నా మీదే ఫిర్యాదు చేస్తారా.? అంటూ మరోసారి విరుచుకుపడ్డారని వివరించారు.