తమిళనాడులో కోయంబత్తూరులో హృదయాలను కదిలించే ఘటన జరిగింది. స్థానిక పట్టీశ్వర దేవాలయం సమీపంలో ఓ 10 గుర్రాలు తిరుగుతుంటాయి. వాటిలో ఓ పిల్ల గుర్రం మంద నుంచి తప్పి పోయింది. వారం రోజులుగా తన తల్లిని వెతుక్కుంటూ తిరుగుతోంది. ఇటీవల ఓ బస్సుపై తన తల్లిని పోలిన గుర్రం బొమ్మను అది చూసింది. తన తల్లే అనుకుని పొరపడి, చాలా దూరం బస్సు వెంటే పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన వారంతా కంటతడి పెట్టుకుంటున్నారు.