అరటి పండు తొక్కలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. అరటి తొక్కలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్‌లు, నాడీ సమాచార వాహకాల ఉత్పత్తి, నియత్రణకు తోడ్పడుతుంది. అరటి తొక్కను కాసేపు ఉడికించి, ఓవెన్ లో వేడి చేస్తే పొడిగా మారుతుంది. తర్వాత దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు.