ఓ వైపు సంక్షేమం వివరిస్తూ మరోవైపు సమస్యలను ఆలకిస్తూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కొనసాగించారు. మంగళవారం నగరంలోని 2, 3 డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లు నాగమణి, కుమారమ్మతో ప్రతి ఇంటికి వెల్లారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్లను లబ్ధిదారులకు అందజేశారు.