జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది.పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని నిర్ధారించారు. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ అనే గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని మండిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa