అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి, టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ వద్ద జాబ్ ఎక్కడ జగన్ అంటూ నిరసన తెలిపారు. పాదయాత్ర లో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా అసెంబ్లీ కి వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో , జగన్ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకి ఇచ్చిన హామీలు ఎందుకు ఇప్పటికి నెరవేర్చలేదు అని నిలదీస్తాం అన్నారు అలానే ఎప్పుడు హామీలు నెరవేరుస్తారు అని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.