2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పొలాల్లో నుంచి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు నాయకులు చొచ్చుకొచ్చి నినాదాలు చేసారు. సచివాలయం వద్ద తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమురి మారుతి . ఇతర నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసిన పోలీసులు, పలువురు నేతలకు గాయాలు అయ్యాయి. అనంతరం తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa