సమాజం సిగ్గు పడేలా కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయ్ అని తాడేపల్లి గూడెం టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ.. కొడాలి నానికి చుక్కలు చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్. నాని మాట్లాడే మాటలు వల్ల మళ్ళీ తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందనే ఆశల్లో ఉన్నారు. జగన్ పాలనలో బాగా బూతులు వచ్చిన వారికే ప్రమోషన్ లు, దాని కోసమే గుడివాడలో నాని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పై పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై బూతు వ్యాఖ్యలు చేశారు, దీనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.