రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. పుతిన్ ప్రయాణిస్తున్న వాహనంపై బాంబు దాడి జరిగిందని, అయితే ఆ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డాడని యూరో వీక్లీ న్యూస్ అనే మీడియా సంస్థ తెలియజేసింది. పుతిన్ తన ఇంటికి తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు చక్రం పేలినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మరో బ్యాకప్ కాన్వాయ్ లో ఆయనను అధ్యక్ష భవనానికి అధికారులు సురక్షితంగా తరలించారు.