మాజీ అమెరికన్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్ మైఖేల్ జోర్డాన్ 1998 NBA ఫైనల్స్ గేమ్ లో ధరించిన జెర్సీ వేలంలో $10.1 మిలియన్లకు విక్రయించబడింది. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు 80 కోట్లు. హౌస్ సోథెబీస్ ఒక గేమ్‌కు ఇది అత్యధిక వేలం అని ప్రకటించింది. 23 నంబర్ గల ఈ రెడ్ జెర్సీకి 20 రకాల బిడ్లు వచ్చాయని వేలం సంస్థ సోథెబీస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధర దాదాపు 5 మిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. అయితే అనుకున్న దానికంటే రెట్టింపు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa