పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు cybersafety మరియు nationalsecurity అనే అంశంపై పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి స్థానిక AM రెడ్డి కళాశాలలో శుక్రవారం శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)శ్రీ G. బిందు మాధవ్ ఐపీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారభించినారు. ప్రముఖ IT రంగ నిపుణుడు శ్రీ సాయి సతీష్ గారితో పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి సైబర్ నేరాల - అవి జరిగే తీరు - వాటి నిర్ములన గురించి ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగినది. శ్రీ సాయి సతీష్ గారు హాజరైన పోలీస్ వారికి సైబర్ నేరాలు జరిగే తీరు,పోలీస్ వారి నుండి తప్పించుకోవడానికి నేరగాళ్లు ఉపయోగుంచే సాంకేతికత,సైబర్ నేరాలు జరిగినప్పుడు నేరగాళ్లను పట్టుకోవడానికి ఉపయోగించవలసిన పద్ధతులు గురించి వివరించి,పలు సందేహాలను నివృత్తి చేసినారు. కార్యక్రమ అనంతరం శ్రీ ఎస్పీగారి చేతుల మీదుగా IT నిపుణుడు సాయి సతీష్ గారిని పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తరపున దుస్సాలువాతో ఘనంగా సత్కరించి,మెమెంటో మరియు సర్టిఫికెట్ అందచేశారు.కార్యక్రమానికి హాజరైన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి శ్రీ ఎస్పీగారు పార్టీసిపేషన్ సర్టిఫికెట్ అందచేశారు.