కేవైసీ వెరిఫై చేయకపోతే యూజర్లు 24 గంటల్లో తమ నంబర్‌కు యాక్సెస్ కోల్పోతారని వచ్చే ఫోన్ కాల్స్,మేసేజ్ లు, లింకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని ఎస్.పి తెలియజేసారు. అన్నమయ్య జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్. కస్టమర్ ఐడీ, పిన్, ఓటీపీ మొదలైన ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితులలోను ఇతరులతో పంచుకోవద్దు. కేవైసీ అప్డేషన్ పేరుతో వచ్చే మెసేజీలను నమ్మవద్దు. మోసపోయిన తర్వాతే కాకుండా మోసపోతున్నామని అనుమానం వచ్చినప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి అని తెలియజేసారు.