కృష్ణా జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని , అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్పందన సమావేశపు హాల్ లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ శాఖలలో పెండింగ్ కోర్టు కేసులు , కోర్టు ధిక్కరణ కేసుల వారీగా సమీక్షించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ఏ . పి . ఆన్ లైన్ లీగల్ కేసెస్ మేనేజ్ మెంట్ సిస్టం నందు ప్రతి అధికారి లాగిన్ అయి ప్రతి రోజు వారికి సంబంధించిన కేసుల వివరాలు చెక్ చేసుకోవాలని కేసుల ప్రస్తుత స్థితి తెలుసుకోవాలని సూచించారు . ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల , ఏ . ఎస్ . పి . రామాంజనేయులు , జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు , ఆర్ . డి . ఓ . లు , వివిధ శాఖల జిల్లా అధికారులు , తహశీల్దార్లు పాల్గొన్నారు.