శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద కియా పరిశ్రమ వద్ద బ్రిడ్జి నిర్మాణంకు భూమిని శ్రీసత్య సాయి జిల్లా సంయుక్త కలెక్టర్ టి. యస్ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ యం. నవీన్ పరిశీలించారు. ఈ సందర్బంగా బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మండలంలోని ఎర్రమంచి గ్రామ పొలం లో ఏపిఐఐసి వారు ఆర్వోబి ని నిర్మించుటకు 31. 85 ఎకరాలకు భూ సేకరణ లో భాగంగా ఎర్రమంచి గ్రామ పొలంలోని ఆర్వోబి భూ సేకరణ చేయు భూములను పరిశీలించి 17. 17 ఎకరాలు పట్టా భూమి ( 14 మంది రైతులు ) , 3. 25 ఎకరాల అస్సైన్మెంట్ భూమి ( 13 మంది రైతులు ) మరియు 11. 43 ఎకరాల ప్రభుత్వ భూమి భూసేకరణ చేసినట్లు సంయుక్త కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమము ఏపిఐఐసి జోనల్ మేనేజర్ మురళి మోహన్ , కొరకు తహశీల్దారు డి. స్వర్ణలత , మండల సర్వేయర్ కె. కోదండపాని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.