ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. దీన్ని ఎక్స్రిస్మో హోవర్ బైక్ గా వ్యవహరిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాలు గాలిలో ప్రయాణిస్తుంది. తాజాగా US డెట్రాయిట్ ఆటో షోలో ఈ బైక్ ను కంపెనీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది స్మాలర్ వెర్షన్ బైక్లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర రూ.6 కోట్లుపైనే. అయితే ఇది మరో మూడేండ్లలో 2025 నాటికి సిద్ధమవుతందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa