నంద్యాల జిల్లా: పెళ్లిచూపుల్లో సూటిపోటి మాటలకు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆళ్లగడ్డ గీతావీధికి చెందిన రోజా (25) సర్వేయరుగా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లె గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి చూపులు జరిగాయి. వచ్చిన వారంతా తన రంగు, హైట్ గురించి అవహేళనగా మాట్లాడడం తట్టుకోలేకపోయింది. చేతి నిండా గాజులు ధరించి, శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.