ప్రతిపక్ష సభ్యుల డ్రామాలతో విలువైన సభా సమయం వృథా అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మండిపడ్డారు. వాళ్ళ ఘనకార్యం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం టీడీపీకి లేదన్నారు. సమస్యపై ప్రశ్న వేసిన టీడీపీ సభ్యులు కూడా దాని గురించి మాట్లాడటం లేదు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా బయట మీడియా ముందు డ్రామాలు వేస్తున్నారు. సభలో చర్చిస్తే వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయన్నారు. అలా చర్చ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని వారి భయం. మూడు రాజధానుల విషయంలో సీఎం ఇచ్చిన వివరణ చూసిన తర్వాత ప్రజల్లో చర్చ ప్రారంభం అయిందన్నారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి పరిహారం ఎగ్గొడితే మేము చెల్లించామన్నారు. ఎమ్మెల్యే కానీ వ్యక్తి మాట్లాడే వాటి గురించి నేను మాట్లాడటం అవమానంగా వుంటుందన్నారు.