కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధిలో వైయస్ఆర్ క్రీడాక్లబ్‌ల పాత్ర కీలకం కానుంది. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వైయస్ఆర్ క్రీడాక్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ పర్వదినాలు, ఉత్సవాల సమయంలో పోటీలు నిర్వహించాలని తలపెట్టింది. పెద్ద వయస్సు వారిని వాకింగ్, సైక్లింగ్ తదితర అంశాల్లో ప్రోత్సహించాలని సంకలి్పంచింది. దీనిపై క్రీడాప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను కలెక్టర్ కృతికాశుక్లా ఇటీవల ఆవిష్కరించారు. ఈ యాప్‌లో ఈ నెల 31 వరకూ క్లబ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. జిల్లాలో 21 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీల్లో క్లబ్‌ల ఏర్పాటుకు డీఎస్ఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.