ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది యువతులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగినట్లు సమాచారం. రాహుల్ ట్రావెల్స్‌లో పనిచేస్తున్న యువతులు యువకుడిని కొట్టినట్లు సమాచారం. ఆ యువకుడు గతంలో రాహుల్ ట్రావెల్స్‌లో పనిచేసేవాడని చెబుతున్నారు. యువకుడు అక్కడ పనిచేస్తున్న అమ్మాయిలను మేనేజర్ నంబర్ అడిగాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి గొడవ మొదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa