అసెంబ్లీ సమావేశాల్లో, ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్ళిపొదామా అన్నట్టు టీడీపీ సభ్యులు ప్రవర్తన ఉందని చీఫ్ విప్ ప్రసాద్ అన్నారు. బి.ఏ.సి లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుందని చెప్పారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్యం సిద్దంగా ఉందన్నారు. చర్చకు టీడీపీ నాయకులు భయపడుతున్నారు.. సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారు..చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యేలను సభకు పంపుతున్నట్లు ఉంది. ఈరోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని ప్రసాద్ రాజు కోరారు.