పోలవరంపై సీఎం వైయస్ జగన్ ఇచ్చిన క్లారిటీతో టీడీపీ నేతలకు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రజా సమస్యల పై మాట్లాడాలని ఎమ్మెల్యేలంతా ఎదురుచూస్తున్నారు. రైతాంగ ఇబ్బందుల పై సభలో తమ గొంతు వినిపించాలని చూస్తున్నారు. రైతులకు లబ్ధి చేకూరే బిల్లును ప్రవేశపెడుతుంటే టీడీపీ అడ్డుపడుతుంది. రోజుకో విన్యాసం చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సభ సజావుగా జరగకూదనేదే టీడీపీ లక్ష్యంగా వుందన్నారు. పోలవరం పై చర్చను టీడీపీ సరిగా సాగనివ్వడం లేదు. సీఎం వైయస్ జగన్ పోలవరం పై వివరించడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగా పోలవరం ప్రగతి పై సీఎం వివరించారు. సీఎం ఇచ్చిన క్లారిటీతో టీడీపీ నేతలకు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. రెవిన్యూ, విద్యాశాఖలపై బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ నేతలు ప్రదర్శించిన తీరు బాధాకరం. స్పీకర్, టీడీపీ సభ్యులకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు. మీ పాపాలు ప్రజలకు శాపం కాకూడదని టీడీపీ నేతలను కోరుతున్నా. సభాసమయం వృధాకానివ్వొద్దని కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు.