ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు. దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు సూచించారు. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. విచారణకు తాను హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. దీనిపై ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు.