బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈ నెల 20వ తేదీ నాటికల్లా అల్పపీడనంగా మారనుంది. దీంతో తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లోభారీ వర్షాలు కురువనున్నాయి. చేపట వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.