ఇంట్లో ఉన్నప్పుడో, ఆఫీసులోనే నలుగురు ఓ చోట ఉన్నప్పుడు దోమలు ఎక్కువగా కొందరినే కుడతాయి. అవి అలా కుట్టడం వెనుక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కారణాలను పరిశీలిస్తే దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచి వాటి చూపు మెరుగ్గా ఉంటుంది. సాయంత్రం, రాత్రి అయ్యే కొద్దీ వాటికి చూపు బాగా ఉంటుంది. డార్క్ కలర్ దుస్తులు ధరించిన వారిని దోమలు బాగా కుడతాయి. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ దుస్తులు వేసుకుంటే దోమలు ఆకర్షణకు గురవుతాయి. దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం. మనిషి శరీరం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. లావుగా ఉన్న వారిలోనూ, గర్భిణులలోనూ కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా విడుదల అవుతుంది. అంతేకాకుండా మనిషి శరీరం నుంచి వెలువడే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమోనియా వంటివి ఉంటాయి. ఇవి దోమలను బాగా ఆకర్షిస్తాయి. అంతేకాకుండా శరీరంపై గాయాలు, చర్మ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఫలితంగా సూక్ష్మక్రిములు శరీరంపై తగ్గిపోతాయి. సూక్ష్మక్రిములను కూడా దోమలు ఇష్టపడి, మనిషి శరీరంపై వాలతాయి.