ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు ఇక్కడకు వచ్చి అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వంపై రైతు నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందంటూ నిరసనలు చేసిన అన్నదాతలు.. తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. సచివాలయం వద్ద రైతుల్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, పోలీసుల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో పోలీసులు.. రైతుల్ని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.