భారత్ లో తెల్ల గుండి, ముత్యపు చిప్ప, పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు ఎక్కువగా లభిస్తున్నాయి. వీటి పెంపకానికి 85-90 శాతం తేమ, 16-18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, కంపోస్టు ఎరువు అవసరమవుతుంది. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు పెంచవచ్చు. 35-40 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. కిలో పుట్టగొడుగులు రూ.25-రూ.30 ఖర్చులో పండించవచ్చు. మార్కెట్ లో కిలో పుట్టగొడుగుల ధర రూ.250-రూ.300 వరకు పలుకుతోంది.