‘‘రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి కోలగట్ల వీరభద్రస్వామి అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా 2004లో శాసనసభకు ఎన్నికవ్వడం.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానం లో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అని సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేసారు.