వయసు వల్ల ముడతలు వస్తాయని అంతా భావిస్తారు. అయితే మన శరీరంపై పడే యూవీ కిరణాల వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. చర్మాన్ని అవి కళావిహీనంగా చేస్తాయి. నిగారింపుతో కూడిన ముఖం కావాలంటే ప్రతి రోజూ 8 గ్లాసుల నీరు తాగుతుండాలి. తగినంత నిద్ర, వ్యాయామం కూడా అవసరం. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్ మితిమీరి తాగకూడదు. ముఖ్యంగా మహిళలు మేకప్ అధికంగా వినియోగించడం తగ్గించాలి.