మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్న హనుమంతుడి ఆలయంలో హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ లో వీడియో తీయగా అదికాస్తా వైరల్ అవుతోంది. ఇదంతా దేవుడి మహిమ అని భక్తులు అంటుండగా ఇందులో వాస్తవికత ఇంకా తేలాల్సి ఉందని మరికొందరు అంటున్నారు.