ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. వీఎల్ పురంలోని ఫక్కీ సత్యేంద్ర కుమార్ కు భార్య స్వాతి, కుమార్తెలు రిషిత, హాద్విక ఉన్నారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లగా సత్యేంద్ర తన ఇద్దరు కూతుర్లతో కలిసి రాజవోలు చేపలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడితో చనిపోతున్నట్లు లెటర్ లభించగా పోలీసులు కేసు నమోదు చేశారు.