విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలిపల్లి సమీప రియల్ఎస్టేట్లో పెయింటింగ్ పనులు నిర్వహి స్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ ఎస్.కృష్ణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం సూరెడ్డిపాలెంకు చెందిన ఈర్ల మహేష్(31) గత కొన్ని రోజులుగా ఇక్కడ పెయింటింగ్ పనులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం విద్యుత్తు పరికరంతో పెయింటింగ్‌కు సిద్ధమవుతుండగా విద్యుతు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై మృతుడి బంధువు సూరెడ్డి నరిసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా మని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు చంటి పిల్లలు ఉన్నారు.