రాజస్థాన్ లోని జైపుర్ కు చెందిన నీరజ్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ బగ్ ను గుర్తించాడు. లాగిన్ డీటెయిల్స్ అవసరం లేకుండానే ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ రీల్ థంబ్‌నెయిల్ ను మార్చొచ్చని తెలుపుతూ, ఓ డెమోను ఆ కంపెనీకి పంపాడు. తమ యాప్ లో ఈ లోపాన్ని అంగీకరించిన సంస్థ నీరజ్ కు 45 వేల డాలర్ల(రూ.35 లక్షలు) రివార్డు అందజేసింది. 4 నెలల ఆలస్యానికిగానూ మరో 4500 డాలర్లు(రూ.3.5 లక్షలు) అదనంగా ప్రకటించింది.