చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ పరిధిలోని గొబ్బిల్ల కోటూరులో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఎల్లమ్మ అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఆమె నుంచి 24 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు. కాగా గ్రామంలో ప్రజలకు అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టరాదని అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.