పుత్తూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వసతులు లేక 17 దుకాణాలు ఖాళీ చేశారు. మార్కెట్ ద్వారా మున్సిపాలిటీకి ప్రతి ఏటా రూ. 50 లక్షలు ఆదాయం వస్తున్న వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మార్కెట్లో చాలా గదులు వర్షానికి ఊరుస్తున్నాయి. మార్కెట్ లోపలికి వెళ్లే దారులు లేక ఇరుకుగా ఉండడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. వ్యాపారస్తులు రోడ్డు ముందు వ్యాపారం చేయడంతో పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంబంధించిన మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వ్యాపారస్తులకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.