చిత్తూరు: మదనపల్లి డ్రైవర్స్ కాలనీలో తల్లి కుమార్తెలపై మంగళవారం ఇద్దరు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పుంగనూరు రోడ్డు లోని డ్రైవర్స్ కాలనీకి చెందిన తల్లి జైబున్నీష (60), ఆమె కుమార్తె యాస్మిన్ (30) లు గాయపడ్డారు. ఇద్దరు ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి శ్రీకాంత్, ప్రశాంత్ లు ఇంట్లోకి చొరబడి యాస్మిన్ ను బలవంతం చేశారు. ఆమె లోంగకుండా కేకలు వేయగా తల్లి అడ్డుకుంది. తల్లి కూతురిపై కత్తితో దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.