రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు మంగళవారం మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ సభకు బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ముఖ్య అతిథిగా ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా వస్తున్నారని తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని సూచించారు.