ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. బుధవారం సభ ముందుకు 9 బిల్లులు రానున్నాయి. ప్రభుత్వం 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లు, 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ నివేదికను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ ముందు ఉంచనున్నారు. నేడు సభలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.