దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలల్లో ఆరోగ్యశ్రీ పేదల ఆరోగ్యానికి అండగా నిలిచింది. పేద ప్రజల కోసం ఆలోచన చేసే రూపాయి డాక్టర్‌గా వైయస్ఆర్కు పేరుంది. అలాంటి మహనీయుడి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే బాగుంటుందని భావించాం. సీఎం వైయస్ జగన్ ఏ మండలానికి వెళ్లినా బ్రహ్మండమైన ఆస్పత్రి, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా హెల్త్ యూనివర్సిటీకి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు ఆమోదయోగ్యం అని భావిస్తున్నాం అని మంత్రి మెరుగా నాగార్జున అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేసారు.