ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్యరంగంలో దేశంలో అగ్రగామిగా ఉండాలని, నిపుణులైన, నిష్ణాతులైన డాక్టర్లను తయారు చేయాలని రాజశేఖర్ రెడ్డి ఆలోచన. పేదవాడి ఆరోగ్యం గురంచి ఆలోచించిన సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ ప్రదాత అయిన వైయస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి ప్రతిపాదిస్తుంటే టీడీపీకి భయం వేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మీడియా పాయింట్ వద్ద బుధవారం మంత్రి మాట్లాడారు.
ఈ రాష్ట్ర ప్రజలు తమకు జరిగే మంచిని నిశితంగా పరిశీలిస్తూ, మంచి చేసే వ్యక్తులను ప్రోత్సహిస్తూ, మంచిచేసే నాయకుడి పట్ల అంకితభావంతో ఉంటారు. సీఎం వైయస్ జగన్ ప్రజల కష్టాలను తీరుస్తూ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల ఆత్మగౌరవ రక్షకుడిగా ఉంటే దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చాలని టీడీపీ చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలి అని అయన తెలియజేసారు.