పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు? అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో అయన మాట్లాడుతూ... సత్య హరిశ్ఛంద్రుడిని వైయస్ జగన్ రూపంలో చూశామన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంధి పలుకుతుందన్నారు. పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోందన్నారు. దొంగ ఓట్లతో 6 పర్యాయాలు గెలిచావ్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఏనాడైనా పేదల అకౌంట్లలో రూపాయి అయినా వేశావా? కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ పచ్చ చేస్తాడన్నారు. సారాను తీసుకొచ్చిందే టీడీపీ. మద్యం మీద బ్రతికిందే టీడీపీ.. నేనేమీ పారిపోను …మద్యం పై చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమే. టైం ఇస్తే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. కులవ్యవస్థ, మత వ్యవస్థని తెచ్చింది మీరు. రామారావు గురించి మాట్లాడితే ఎవరూ వినరు. అసలు మీకు ఆ అర్హత లేదన్నారు.