దోచుకున్న సొమ్ములో, దోచుకున్న భూముల్లో కొంత సమాజానికి వెనక్కి ఇచ్చి అందులో ఒక ఆసుపత్రి నిర్మించి, ప్రజలకు సేవ చేస్తూ ఆ ఆసుపత్రికి పెట్టుకోవచ్చుగా వైఎస్సార్ పేరు? అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి వేలాది మందికి అత్యుత్తమ సేవలు అందిస్తూ, NTR ట్రస్ట్ పేరుతో లక్షలాది మందికి సహాయం చేస్తున్నారు. వైద్య విశ్వ విద్యాయం పెట్టారు, క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించారు.. ఆయన్ను మించి అర్హత ఉందా మీకు? మీకు చేతనైతే కొత్తగా మీరు నిర్మించి దానికి వైఎస్సార్ పేరు పెడితే వద్దనేది ఎవరు? పాతికేళ్ళ క్రితం చంద్రబాబు గారు పెట్టిన పేరు నేడు మార్చడం అనైతికం, అసంబద్ధం అని అభిప్రాయపడ్డారు.