తమిళనాడులోని తిరుచ్చికి చెందిన బబితా రోజ్ అనే ట్రాన్స్జెండర్ తాను ఐఏఎస్ అధికారినంటూ దాదాపు 15 మంది యువకులను మోసం చేసింది. 8 మందిని ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి చేసుకున్నాక నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యేది. బబిత పెళ్లి చేసుకున్న వారిలో పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు సైతం ఉన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం బబిత పరారీలో ఉంది.