ఖర్జూరం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా గర్భిణులు తరచూ ఖర్జూరం తీసుకుంటే ఐరన్ బాగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలు ఖర్జూరాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తినడం ఎముకల దృఢత్వానికి చాలా మంచిది. ఖర్జూరాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.