తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది మరియు మొటిమలు క్రమంగా తగ్గుతాయి. తులసి ఆకులను దంచి మొటిమల మీద రాయాలి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ముఖంపై చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసి పొడిని రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకుంటే రంధ్రాలు తెరుచుకుంటాయి. మొటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.