బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం సమీపమున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ శాఖ ఆర్ వి జానకి రామయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో గల మందులను, ఓ పి రిజిస్టర్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు, నూతన మందులు అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్ ను ఆదేశించారు.