తెలుగు భాషా సాహిత్యానికి గురజాడ అప్పా రావు వెలుగు జాడగా నిలిచారని ఎంఈవో ధనుంజయ మజ్జి, కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావులు అన్నారు. కవిటి మండలంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలతో పాటు మండలంలోని వివిధ పాఠశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇద్దివాని పాలెంలో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల నాటకాన్ని ప్రదర్శన చేసి బాలబాలి కలకు నాటకంలోని రసరమ్యతను ఉపాధ్యాయుడు మురళీ ప్రకాష్ వివరించారు. గురజాడ తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమాల్లో హెచ్ఎం వరలక్ష్మీ, కేశవపు రియ , రాజేష్ కుమార్, లింగరాజ్ పట్నాయక్ పీఏ సీఎస్ డైరెక్టర్ ఎన్ని అశోక్, మండల కో - ఆప్షన్ సభ్యుడు పాండవ చంద్రశేఖరా పాల్గొన్నారు.