ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో హమ్మయ్య అంటూ ఆ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వంగర మండలం లోని కొండశాఖరాపల్లి, కొప్పరా గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బ్రతికారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నది పరివాహక గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీసారు. ప్రధానంగా కొప్పర కొండశాఖరాపల్లి గ్రామాల ప్రజలకు కొద్దిరోజుల క్రితమే వరదలకు బిక్కుబిక్కుమని బ్రతికారు. మళ్లీ ఈ సమయంలో సువర్ణముఖి, వేగవతి నదుల పొంగుతాయేమోనని ఆందోళన పడ్డారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రెండు నదులలో ఏ నది లో నైనా నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదని ఆందోళన చెందారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీరు మామూలుగా మారింది. దీంతో తమకు తుఫాను ముప్పు తప్పినట్లే నని ఆ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.