భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో ఓడిన టీమిండియా ఎలాగైనా రెండో టీ20లో గెలవాలని చూస్తోంది. రెండో టీ20లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. ఉమేష్ స్థానంలో బుమ్రా, చాహల్ స్థానంలో అశ్విన్ ఆడే అవకాశం ఉంది. పంత్ కి కూడా ఛాన్స్ ఇవ్వొచ్చు. రేపటి మ్యాచ్ నాగ్ పూర్ లో రాత్రి 7 గంటల నుంచి జరగనుంది.