మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో కొందరు వ్యక్తులకు 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారు రాత్రికి రాత్రే లక్షాధికారులయ్యారు. బ్రిజ్పుర్కు చెందిన రాజేంద్ర అనే రైతు మరో ఆరుగురితో కలిసి లల్కీ ధేరీలో ఓ వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. నెలరోజులుగా వెతికినా వారికి వజ్రం దొరకలేదు. గురువారం 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. వజ్రాన్ని అధికారులకు చూపించగా, దాని విలువ భారీగానే ఉండొచ్చని చెప్పారు.