బ్రిటిష్ మిలియనీర్ అజాజ్ షా హుస్సేన్‌కు ఇటలీ కోర్టు షాక్ ఇచ్చింది. తన మాజీ ప్రేయసి (27)పై దాడి చేసిన కేసులో అతడికి కోర్టు నాలుగేళ్ల 8 నెలల జైలు శిక్ష విధించింది. 'లంబోర్ఘిని స్టాకర్'గా ఫేమస్ అయిన అజాజ్ షా తన మాజీ ప్రియురాలిపై గతంలో దాడి చేశాడు. ఆపై ఆమె ముఖాన్ని వేడి వేడి ఇనుప రాడ్డుతో కాల్చేశాడు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది.